భళా తందనాన ఫస్ట్ లుక్ లో కేథరిన్.. మామూలుగా లేదుగా?

కేథరిన్ హీరో నాని నటించిన పైసా సినిమాలో హీరోయిన్ గా చేసి అందరి సినిమా లో చోటు సంపాదించుకున్న కేథరిన్ ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించింది. అల్లుఅర్జున్ తో కలసి ఇద్దరమ్మాయిలతో, సరైనోడు లాంటి సినిమాలలో నటించింది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ లో అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందకపోవడంతో ఈ బ్యూటీ వెనకబడిఉంది. మొదట చమ్మక్ చల్లో సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఇది ఇలా ఉంటే నేడు కేథరిన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమా అప్డేట్స్ ప్రకటిస్తూ మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేథరిన్ నటిస్తున్న భళా తందనాన సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో ఈమె శశిరేఖ అనే యువతి పాత్రలో నటిస్తోంది. ఇందులో నటుడు శ్రీ విష్ణు హీరోగా నటిస్తుండగా, ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. కేథరిన్ ఈ సినిమాతో పాటు బింబిసార అనే సినిమాలో కూడా నటిస్తోంది.

Share post:

Latest