బుచ్చిబాబుతో మహేష్ బాబు.. ఏమిటీ కథ?

టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు సానా, తొలిచిత్రంతోనే అదిరిపోయే సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాను పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన బుచ్చిబాబు, ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా మలిచి సక్సెస్ కొట్టాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన రెండో సినిమా కోసం రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే బుచ్చిబాబు తన రెండో సినిమా ఎవరితో చేస్తాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

కాగా ఇటీవల బుచ్చిబాబు సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రత్యేకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహేష్‌తో బుచ్చిబాబు ఏ విషయంపై కలిశాడా అని టాలీవుడ్ జనాలు జుట్టు పీక్కుంటున్నారు. కాగా బుచ్చిబాబు ఏదైనా కథను మహేష్‌కు వినిపించాడా? లేక మహేష్ బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడా? అనేది ఎవరి ఊహలకు అందకుండా ఉంది. దీంతో మహేష్ బాబు తన నెక్ట్స్ చిత్రాన్ని బుచ్చిబాబుతో చేస్తాడేమో అనే ఊహాగానాలు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే బుచ్చిబాబును ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేయాల్సిందిగా మహేష్ కోరినట్లు తెలుస్తోంది. దీనికి బుచ్చిబాబు తనకు కొంత సమయం కావాలని కోరాడని, మహేష్ కూడా దానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. మహేష్ బాబును డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ బుచ్చిబాబు కొట్టేసినట్లే అని సినీ విశ్లేషకులు ఓ నిర్ధారణకు వచ్చేశారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్‌గా ఏదైనా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.