బాలీవుడ్ హీరోల బాడీగార్డ్ జీతం తెలిస్తే షాక్..!

బాలీవుడ్ హీరోల విషయానికి వస్తే , వీరికి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అనే చెప్పవచ్చు . ఇక అలాంటి వారు ఒకసారి ఏదైనా పనిమీద కానీ ఏదైనా ఈవెంట్ కు కానీ బయటికి వస్తే ,ప్రేక్షకుల నుంచి వీరిని కాపాడడం చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా విపత్కర పరిస్థితులలో కూడా తమను తాము రక్షించుకోవడం కోసం వీరు జీతం ఇచ్చి మరీ బాడీగార్డ్ లను పెట్టుకున్నారు. అయితే బాలీవుడ్ హీరోల దగ్గర పనిచేస్తున్న బాడీగార్డ్ ల జీతం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

1. అమితాబ్ బచ్చన్:
బాలీవుడ్ లో బిగ్ బీ గా గుర్తింపు పొందిన అమితాబచ్చన్ దగ్గర బాడీగార్డ్ గా ఎన్నో సంవత్సరాలుగా జితేంద్ర షిండే పని చేస్తున్నారు. ఈయనకు అమితాబ్ బచ్చన్ సంవత్సరానికి రూ.1.50 కోట్లు జీతంగా ఇస్తున్నారట.

2. సల్మాన్ ఖాన్:
కండలవీరుడు గా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వంద కోట్ల రూపాయలు తీసుకునే హీరోలలో ఒకరిగా ఎదిగారు. ఇక ఈయన దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా షరజీతమ్ అనే బాడీగార్డ్ పనిచేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ తన బాడీ గార్డ్ కు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలను జీతంగా ఇస్తున్నాడట.

3. షారుక్ ఖాన్:
బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపుపొందిన షారుక్ ఖాన్ దగ్గర శరసింగ్ పని చేస్తున్నారు. ఇతనికి ఏడాదికి జీతం రూ.2.70 కోట్లు.