బిగ్ బాస్ షో స్టేజ్ పై రామ్ చరణ్.. అందుకోసమేనా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా బిగ్ బాస్ షో గురించి వినిపిస్తోంది. ఇప్పటికే ఈ షో ఫస్ట్ ఎలిమినేషన్ పూర్తి చేసుకోగా రెండవ ఈ వారం ఎలిమినేషన్ దగ్గరపడింది. అయితే రెండవ వారం ఎలిమినేషన్ అయ్యేది వీరే అంటూ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ఉమాదేవి ల పేర్లు వినిపిస్తున్నాయి. దీనితో రెండవ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు అన్న విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇక ఇది ఇలా ఉంటే ఎపిసోడ్ లో మాస్ట్రో సినిమా టీమ్ సందడి చేయనున్నట్లు సమాచారం .ఈ మేరకు బిగ్ బాస్ స్టేజ్ పై తమన్నా, నితిన్, నభా నటేష్ ఇంటి సభ్యులను పలకరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరితో పాటుగా రామ్ చరణ్ కూడా .

ఇక ఈ బిగ్ బాస్ షో అయిపోగానే మినీ బిగ్ బాస్ షో లో ప్రవేశ పెడతారట. ఇది కేవలం 50 రోజులు మాత్రమే కొనసాగుతుందని, అది కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే ప్రసారం చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ షో కోసం ఎక్కువగా సోషల్ మీడియా స్టార్లు అలాగే టీవీ యాంకర్ లను ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి బిగ్ బాస్ వచ్చే ఏడాది ఆరో సీజన్ లో పాటిస్పేట్ చేసే అవకాశం కల్పిస్తారట. ఇక ఇటీవల రామ్ చరణ్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన విషయం అందరికి తెలిసిందే. ఇక అందులో భాగంగానే రామచంద్ర నేటి షో కు వచ్చి ఉంటాడని అనుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే నేటి ఎపిసోడ్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.