ఆ కంటెంస్టెంట్ కే నా సపోర్ట్ : దుర్గారావు?

దుర్గారావు టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో ఇతను కూడా ఒకరు. ఇతను ఎన్నో టిక్ టాక్ వీడియోలు తీసినప్పటికీ నాది నక్లెస్ గొలుసు అనే పాటకు ఇతని భార్య తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో కావడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత కూడా ఎన్నో వీడియోలు ఏది సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. దీనితో ఇతనికి బుల్లితెరపై కూడా పలు అవకాశాలు వచ్చాయి. దుర్గారావు అతని భార్య ఇద్దరూ కలిసి బుల్లితెరపై పలు షోలలో కనిపించి ఆకట్టుకున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే దుర్గారావు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారాలు జరిగాయి. దుర్గారావు కూడా పలు ఇంటర్వ్యూలలో తలకు బిగ్ బాస్ షో నుంచి పిలుపు వచ్చింది అని చెప్పుకొచ్చాడు. కానీ బిగ్ బాస్ సీజన్ లో మాత్రం అతను పాల్గొనలేదు. ఇక తాజాగా బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ. తాను యాంకర్ రవి కోసమే బిగ్ బాస్ చూస్తున్నాం అని, ఆయన నవ్వు,అందం చూస్తే అచ్చం మహేష్ బాబు లాగానే ఉంటారు. నేను మహేష్ బాబు అభిమానిని. నాకు యాంకర్ రవి ని చూస్తుంటే మహేష్ బాబూనే గుర్తుకు వస్తారు . నా ఫుల్ సపోర్ట్ రవి గారికే అని, ఎప్పుడు చిరునవ్వుతో పలకరించే రవి గారు అంటే నాకు, నా భార్యకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు.