బిగ్ బాస్ -15 లో సల్మాన్ రెమ్యునరేషన్ అంతనా..?

బిగ్ బాస్ షో రియాల్టీ షోలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై వినోదానికి చిరునామాగా నిలిచింది ఈషో. ఇక హిందీలో బిగ్ బాస్ సీజన్-15 సీజన్ అక్టోబర్ మాసంలో ప్రారంభం కానుంది. ఈషోకి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఏకంగా 14 వారాల పాటు కొనసాగుతూ ఉంటుంది.

ఈ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా 350 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. వరుసగా బిగ్ బాస్ 11 సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు ఈ హీరో. ఇక అంతే కాకుండా టీవీ షోలలో ప్రసారమయ్యే రియాల్టీ షోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హొస్టు గా నిలిచాడు.

గత సీజన్లలో వారానికి 13 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకునేవాడు. ఇక మన తెలుగు విషయానికి వస్తే నాగార్జున బిగ్ బాస్-5 కి హొస్ట్ గా 12 కోట్ల రూపాయలను మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడు.గత సంవత్సరం బిగ్ బాస్ -4 కి నాగార్జున 8 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

Share post:

Latest