విదేశీ హోటల్లో ప్రియురాలితో పట్టుబడ్డ సల్మాన్ ఖాన్..?

ఈ మధ్యనే రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్ సినిమా ఫెయిల్యూర్ సల్మాన్ ఖాన్ నిరాశపరిచిన విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో లులియా వాంటూర్ ఒక పాటను ఆలపించారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ పక్షుల ప్రయాణం అంటూ సల్మాన్ ఖాన్ లులియా జంట పై ప్రచారం తెరపైకి వచ్చింది. వీరిద్దరూ ఆ సినిమా షూటింగ్ సమయంలో షికార్లు చేసిన ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా తాజాగా ఈ జంట టర్కీ హోటల్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ టూర్ కి వీరిద్దరూ పర్సనల్ గా వెళ్లారా లేక షూటింగ్లో భాగమా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర యూనిట్ అంతా టర్కీ కి వెళ్లారు. అక్కడ ఇస్తాంబుల్ లో కీలక సన్నివేశాలు ప్లాన్ చేశారు. అక్కడ లులియా సల్మాన్ ఖాన్ ని అంటిపెట్టుకొని ఉండటంతో, సినిమాలో పాటలు పాడడానికి వచ్చిందా లేక సల్మాన్ కోసం పర్సనల్ గార్డ్ లా వచ్చిందా అని యూనిట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రశ్నిస్తున్నారు.

Share post:

Latest