అశ్లీల కేసులో రాజ్ కుంద్రా కు బెయిల్ మంజూర్..!

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను, అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో ముంబై పోలీసులు జూలై 19 వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే మొత్తం 11 మందిని ఈ కేసులో విచారించగా, పూర్తి వివరాలు తెలిసే వరకు ఎవరికీ క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే లేదు అని ముంబై కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఇక శిల్పా శెట్టి కూడా విచారణ లో పాల్గొని ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంది.

ఇక కోలీవుడ్ నుంచి పలువురు స్టార్ హీరోలు ఈమెకు మద్దతు పలకడంతో, కొంతవరకు ఉపశమనం కలిగింది అని చెప్పాలి. కాకపోతే శిల్పాశెట్టికి ఏమాత్రం తెలియకుండా రాజ్ కుంద్రా ఇలాంటి వ్యాపారం చేశాడని, ఆమె ఆరోపించినప్పటికీ అధికారులు నమ్మలేదు. ఎట్టకేలకు రాజ్ కుంద్రా తో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న శిల్పాశెట్టి.. ఆ తర్వాత పలు వార్తలతో మీడియాలో నిలిచింది.. ఇకపోతే ఎట్టకేలకు ఇటీవల రాజ్ కుంద్రా కు బెయిల్ మంజూరు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.https://twitter.com/ANI/status/1439921550103244811?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1439921550103244811%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2F10tv.in%2Fnational%2Fmumbai-court-grants-bail-to-raj-kundra-in-pornography-case-278553.html

 

ఈయనను 50వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. ఇకపోతే అశ్లీల చిత్రాల్లో దొరికిన రాజ్ కుంద్రా బ్రిటన్ సిటిజన్ గా వున్న ఈయన, మొదట్లోనే బెయిలిస్తే ఎక్కడ విదేశాలకు వెళ్ళి పోతాడో అన్న భయం తోనే ఆయన పాస్ పోర్ట్ ను కూడా క్యాన్సిల్ చేసి ఇన్ని రోజులు కస్టడీలోనే ఉంచామని కోర్టు వెల్లడించింది.యాప్ యూజర్లు మూడు రెట్లు పెంచుకోవడమే లక్ష్యంగా రాజ్ కుంద్రా ప్లాన్ చేశాడని, రెండేండ్లలో 8రెట్ల లాభం పొందాలని భావించాడని, 119 అశ్లీల చిత్రాలను నిర్మించి, రూ.8.84 కోట్లకు అమ్మాలని అనుకున్నట్లు చార్జిషీట్‌లో పెట్టారు