పాగల్ హీరో విశ్వక్సేన్ ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసి అందులో విశ్వక్సేన్ ప్రేక్షకులను ఆర్థిస్తున్నట్లు మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..
ఈ వీడియోలో విశ్వ..తనకు వయస్సు పెరిగిపోతోందని, వధువు కూడా దొరకడం లేదని చెప్పాడు.. కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయిని.. నాకు ఇచ్చి పెళ్లి చేయండి.. బ్యాచిలర్ లైఫ్ నుంచి నన్ను విముక్తి చెందేలా చెయ్యండి అంటూ ప్రేక్షకులను కోరుతున్నాడు.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి రవికిరణ్ స్క్రిప్ట్ ను అందించడం జరిగింది.
ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ లో ఈ సినిమాను బాపినీడు అలాగే సుధీర్ ఎడారా బ్యాంక్ రోలింగ్ చేస్తున్నారు. ఇక బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.