అన్నం ఇలా వండకపోతే.. ఈ వ్యాధి రావడం ఖాయం..!!

ఉత్తర భారత దేశ ప్రజలతో పోల్చుకుంటే దక్షిణ భారత దేశ ప్రజలు ఎక్కువగా ఆహారంగా వరి ఆధారిత పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిలో ముఖ్యమైనది అన్నం అని చెప్పవచ్చు.

అన్నం లేనిదే ఏ ఇంట్లో కూడా ఎలాంటి వంట వండరు. అంతే కాదు అన్నం వండడం అతి సులువైన పని కూడా.. సరైన పద్ధతిలో అన్నం వండకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో దక్షిణ భూభాగం అంతా అన్నం తింటున్న వాళ్ళు ఎక్కువే.. ఇందుకు గల కారణం మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి, ప్రతి ఒక్కరు ఎక్కువగా వరి , గోధుమ వంటి ధాన్యాలను పండిస్తారు.. మనం పండించిన వాటిని ఎక్కువగా ఆహారంగా స్వీకరిస్తున్నాము.

ముఖ్యం పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలలో బియ్యంతో చేసిన ఎన్నో రకాల ఆహార పదార్థాలను వడ్డిస్తారు. ఆలయాలలో కూడా దేవుడికి సమర్పించే నైవేద్యాలలో కూడా ఈ బియ్యంతో చేసిన పదార్థాలు ఉంటాయి ..ముఖ్యంగా పొంగలి, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం అంటూ ఎన్నో ఆహారపదార్థాలను బియ్యం తో తయారు చేసిన పదార్థాలు కావడం గమనార్హం.

ఈ బియ్యంలో ఎక్కువ సంఖ్యలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.. కాబట్టి శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.. ఇక ముఖ్యంగా అత్యంత సులభమైన వంటకం అన్నం తయారు చేయడం.. కాబట్టి దీనిని సరైన పద్ధతిలో వండకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. ఇటీవల ఇంగ్లాండులోని క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం , చాలామంది కీటకాల నుంచి వరి పంటను కాపాడడం కోసం అధిక మొత్తంలో రసాయనిక ఎరువులను, పురుగుమందులను ఉపయోగిస్తున్నారు.. వీటి ప్రభావం బియ్యంపై అధికంగా పడుతోందని ఈ అధ్యయనం చెబుతోంది. రసాయనాలు కలిగిన బియ్యాన్ని సరైన పద్ధతిలో ఉడికించకుండా తినడం వల్ల రసాయనాలు శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట.