హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్న తెలుగు లేడీ కమెడియన్?

తన నటనతో కామెడీ టైమింగ్ తో తెలుగు, తమిళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇటీవల తన ప్రియుడిని పెళ్లాడింది. గతంలో లాక్ డౌన్ సమయంలో విద్యుల్లేఖ సన్నబడి అందరికీ షాక్ ఇచ్చింది. ఈమె ఫిట్నెస్ నిపుణులు న్యూట్రీషియన్ సంజయ్ ను ప్రేమించి ఇరు కుటుంబాల అంగీకారంతో సెప్టెంబర్ 9వ తేదీన వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటికి రాలేదు. అంతేకాకుండా పెళ్లి కూడా ఎవరికీ తెలియకుండా ఏ హడావిడి లేకుండా చేసుకుంది.

ఇక ఇటీవల పెళ్లి ఫోటోలను విద్యుల్లేఖ రామన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్ దీవ్స్ కి వెళ్లారు. అక్కడ దిగిన కొన్ని ఫోటోలను వీడియోలను విద్యుల్లేఖ రామన్ తన సోషల్ మీడియా ద్వారా చేసింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల ప్రదేశం అంటే తనకు ఎంతో ఇష్టమని.. తన హృదయాన్ని తాకింది అని పోస్టు ద్వారా తెలిపింద.గత ఏడాది వీరు పెళ్లి చేసుకోవాలని అనుకోగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.