అల్లు అర్జున్ మూవీ లో సెకండ్ హీరోయిన్ ఈమెనట..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప.ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఐకాన్ సినిమాలో నటించనున్నారు అల్లు అర్జున్.ఇక ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజ హెగ్డే నిర్ణయించగా..సెకండ్ హీరోయిన్ కృతి శెట్టి ఎంపికయ్యారని తెలుస్తోంది.

సాధారణంగా అల్లుఅర్జున్ హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్త గా ఉంటాడు అన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఒకసారి నటించిన హీరోయిన్లతో మరి నటించాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పూజ హెగ్డే కు మాత్రం బన్నీ జోడి గా నటించే అవకాశం మరోసారి దక్కించుకుంది.ఇక డీజే, అలా వైకుంఠపురం సినిమాలో బన్నీ కి జోడిగా నటించింది పూజ హెగ్డే.23 Krithi shetty ideas in 2021 | beauty full girl, beautiful girl photo,  beautiful indian actress

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి.అందుచేత తన అభిమానులు మరొకసారి ఆమె తో జత కట్టాలని కోరుకుంటున్నారట.అందుచేతనే ఈ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం.ఇక ఇందులో రెండో హీరోయిన్ గా ఉప్పెన సినిమాలో నటించిన కృతి శెట్టిని హీరోయిన్ గా నిర్ణయించడం జరిగింది.

ప్రస్తుతం హీరోయిన్ కృతి శెట్టి నానితో కలిసి శామ్ సింగరాయ్ సినిమాల్లో నటిస్తున్నది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.ఏది ఏమైనా అతి తక్కువ సమయంలో స్టార్ హీరో తో నటించడం కేవలం కృతి శెట్టి కే సాధ్యమైంది.

Share post:

Popular