ఆకట్టుకుంటున్న సప్తగిరి గూడుపుఠాని ట్రైలర్ ..!

కామెడీ , యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం గూడుపుఠాని.. ఇందులో ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందిన సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలన్ గా ప్రేక్షకులకు రెండోసారి రాబోతున్నాడు.. పలాస 1978 సినిమా ద్వారా విలన్ గా ప్రేక్షకులకు పరిచయమైన రఘు కుంచే , ఈసారి సప్తగిరి సినిమాతో తనలో ఉన్న విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా 90 ఎమ్మెల్ ఫేమ్ నేహా సోలంకి నటిస్తోంది.

ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేయడంతో, ఈ సినిమా అప్పుడే మంచి క్రేజ్ ను అభిమానులలో సంపాదించుకుంది. 1977లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇదే టైటిల్ తో సప్తగిరి మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదల చేశారు..

ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు అందరూ సప్తగిరి అన్న..! ఈసారి సూపర్ హిట్ కన్ఫార్మ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.. టెన్షన్తో , భయంతో గ్రామాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ట్రైలర్ చాలా బాగుంది.. అంతేకాదు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు నెలకొంటున్నాయి..ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో వేచిచూడాల్సిందే.

Share post:

Latest