అదిరిపోయే అప్డేట్ తో వచ్చిన కొండపొలం..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు క్రేజ్ బాగానే పెరుగుతోంది.. ఈ నేపథ్యంలోనే మెగా మేనల్లుడి గా ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో వైష్ణవ తేజ్. ఈ మూవీ ఇటు క్లాస్ ఆడియన్స్ ను అటు మాస్ ప్రేక్షకులను బాగా మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.. ఈ సినిమాలో ఒక మధ్యతరగతి యువకుడిగా వైష్ణవ్ తేజ్ చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.. డెబ్యూ మూవీతోనే మంచి అఖండ విజయాన్ని అందుకున్న వైష్ణవి తేజ్ కు సినీ ఇండస్ట్రీలో వరుస పెట్టి అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం కొండపొలం..ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు.. కొండపొలం అనే సినిమా ను ప్రముఖ నవల కొండపొలం ఆధారంగా తీసుకొని చిత్రీకరించడం జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమాలో హాట్బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ గ్రామీణ అమ్మాయిలా కనిపించబోతోంది.. అంతే కాదు గొర్రెలు కాచుకుంటూ ఓబులమ్మ గా రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం కాగా, వైష్ణవి తేజ్ కటారు రవీంద్ర అనే పాత్రలో కనిపించనున్నారు..

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వచ్చే సోమవారం సాయంత్రం 3:33 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు కృష్ణ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు .

https://twitter.com/DirKrish/status/1441732083680874500?s=20