ప్రగతి ఆంటీ ఫ్లాష్‌బ్యాక్.. డబ్బుల కోసమే అలాంటి పనులు!

టాలీవుడ్‌లో హీరోహీరోయిన్లకు ఉన్న స్టార్ స్టేటస్ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఉంటుంది. అయితే వారు చాలా కాలంగా తమదైన నటనతో ఇండస్ట్రీలో గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా, వారు తమ పాత్రలతోనూ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ను సొధిస్తుంటారు. ఇలాంటి అతి తక్కువ మందిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా ఒకరు. ప్రగతి అంటే ఠక్కున ఎవరికీ గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. ప్రగతి ఆంటీ అంటే మాత్రం ఆమె పేరు తెలియని వారు ఉండరు. ఇంతలా ఇమేజ్ తెచ్చుకున్న ప్రగతి ఆంటీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్లాష్‌బ్యాక్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది.

దీంతో ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ప్రగతి చేసిన పనులు తెలుసుకుని నోరెళ్లబెట్టారు. నటి ప్రగతి ఇలాంటి పనులు చేసిందా అంటూ వారు ముక్కున వేలేసుకుంటున్నారు. తన చిన్ననాటి నుండే ప్రగతి చాలా యాక్టివ్‌గా ఉండేదట. అయితే తన ఇంట్లో తాను మగరాయుడిలా ఉండేదని, అందుకే తనకు ఎక్కడ పని దొరికినా వెళ్లి చేసేదట. టెలిఫోన్ బూత్, పిజ్జా హౌజ్ లాంటి చోట్ల ఆమె డబ్బుల కోసం పని చేసినట్లు తెలిపింది. ఇక సినిమాల్లో అవకాశం కోసం ఈ ఆంటీ చాలా కష్టపడిందట. అయితే తాను అనుకున్న పాత్రలు దొరక్కపోవడంతో, చేతికి వచ్చిన ప్రతి పాత్రను చేసుకూంటూ వచ్చిందట.

ఇక తన వయసుకు మించిన పాత్రలు దక్కడంతో చేసేదేమీలేక వాటిని చేస్తూ వచ్చిందని, అవే తనకు చాలా గుర్తింపును తీసుకొచ్చాయని ప్రగతి ఆంటీ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ప్రగతి తన కెరీర్‌లో ఎదుర్కొన్న సమస్యలు తనకు చాలా గుణపాఠాలు నేర్పాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో వర్కవుట్స్ చేస్తూ పెట్టే వీడియోలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా ప్రగతి డబ్బుల కోసం అలాంటి పనులు చేసిందని తెలుసుకుని ఆమె అభిమానులు హ్యాట్సాఫ్ కొడుతున్నారు.

Share post:

Latest