వైసీపీ కి రాజీనామా చేయనున్న విజయమ్మ ..?

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వై యస్ విజయమ్మ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లూ తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలు గా ఉన్న ఈమె రాజీనామా చేయబోతున్నారు అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.ఇకపోతే కూతురు షర్మిల భవిష్యత్తు కోసం ఈమె వేగంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో హైదరాబాదులోని ముఖ్యనేతలతో విజయమ్మ భేటీ కానున్నారు.

తన కూతురు పెట్టిన వైయస్సార్ టీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు గా బాధ్యతలు చేపట్టనున్న ట్లు సమాచారం. ఎల్లుండి వైఎస్ఆర్ వర్ధంతి కాబట్టి ఆమె హైదరాబాదులో ఉన్న ఒక హోటల్ లో ప్రముఖ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో వైఎస్ఆర్సీపీకి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలకు కబురు పంపినట్లు సమాచారం.

ఇకపోతే తన కూతురు భవిష్యత్తును కూడా ఒక దారిలో పెట్టడానికి ప్రజలకు విజయమ్మ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇవ్వడం గమనార్హం.

Share post:

Latest