మహిళల్ని భయపెడుతోన్న ఆ ఫోన్ కాల్..?

ఈ మధ్య కాలంలో దోపిడీలు పెరిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఫోన్ కాల్ అందర్నీ భయపెడుతోంది. ఎట్టకేలకు ఆ ఫోన్ నంబర్ ను వెతికేపనిలో పోలీసులు ఉన్నారు. ఒక అజ్ఞాత వ్యక్తి మహిళలే టార్గెట్ గా ఫోన్ కాల్స్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి వారి ప్రమోషన్‌ గురించి మాట్లాడుతాడు. ఆ తర్వాత వారి ఫోటోలు కావాలని, ఏవేవో డాక్యుమెంట్లు కావాలని అడుగుతాడు. వాడి మాట కనుక నమ్మితే ఇక బుక్కవ్వాల్సిందే. సారవకోట, మెళియాపుట్టి మండలాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో విషయం పోలీసుల వద్దకు చేరింది.

ఓ మహిళకు కోపం వచ్చి అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే చాలా మంది అంగన్వాడీ టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులకు గురిచేశాడు. కలెక్టర్ ఆఫీసులు పనిచేస్తున్నానని, పీడీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నానని, ఇలా ఏదో ఒక ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నానంటూ వారి నుంచి డబ్బులు గుంజాలని చూస్తాడు. ఒంటరి మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, ఏఎన్‌ఎంలే టార్గెట్ గా ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నాడు. పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.