వినాయక చవితికి సిద్ధంగా ఉన్న నాగ చైతన్య, సాయి పల్లవి..!

నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న చిత్రం” లవ్ స్టోరీ”. ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ ఎంతో సూపర్ హిట్ గా నిలిచాయి. అంతేకాకుండా సాయిపల్లవి ఈ సినిమాలో సారంగదరియా పాటకు కొన్ని వేల మిలియన్ల లైక్స్ అలాగే వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.

ఈ సినిమాలోని పాటలు, టీజర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక గత మాసం నుంచి థియేటర్లు ఓపెన్ అవడం చేత ఈ సినిమాను వినాయక చవితి పండగ సందర్భంగా 10 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి కూడా బాగా ప్లస్ అవుతుందని ఉద్దేశంతోనే ఈమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ తో పాటు ఇతర భాషలలో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడుపోయినట్లు వినిపిస్తున్నది. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు అనేది ఎక్కువగా వినిపిస్తున్నది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా మూవీ కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదిస్తోంది ఈ సినిమా. ఇక ఈ సినిమాకి ముఖ్యకారణం సాయిపల్లవి కావడం విశేషం.

ఇక ఈ సినిమా ఎన్ని అంచనాలను అందుకుంటుందో విడుదలయ్యే వరకు మనం వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాతోనైనా నాగచైతన్య సినీ కెరియర్ లో మరొక మైలు రాయి అవుతుందేమో చూడాలి.

Share post:

Popular