శ్రీదేవి సోడా సెంటర్ షూటింగ్ లో ఇన్ని ప్రమాదాలు జరిగాయా..వామ్మో!

కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాతలు అయిన విజయ్ చిల్లా, అలాగే శశిదేవి రెడ్డి మాట్లాడుతూ మేము సినిమా సినిమాకి గ్యాప్ తీసుకోవడం లేదు. మంచి కథ కుదిరితే సినిమా చేస్తాం. కథలు వినడమే మా పని. కథ నచ్చితే పెద్ద హీరోలతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా స్టార్ట్ చేయగానే జరిగిన కొన్ని ప్రమాదాల గురించి చెప్పుకొచ్చారు .

- Advertisement -

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన రోజే నేను కెమెరా పడిపోయిందని, లక్కీగా ఆ కెమెరా కి ఏం కాలేదని తెలిపారు. అలాగే ఆ మరుసటి రోజు అసిస్టెంట్ కు షాక్ కొట్టి గాయపడ్డాడని, ఆ తర్వాతి రోజు కేవలం క్యారవాన్ గోతిలో ఇరుక్కుపోయిందని, అన్నిటికంటే ముఖ్యంగా విజయ్ చిల్లా అతను సోదరుడిని కోల్పోయాను అని తెలిపారు. దీంతో నెల రోజులు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం అని తెలిపారు. ఇక సినిమా విషయానికి వస్తే ఈ రూలర్ లవ్ స్టోరీ లో సుధీర్ బాబు, ఆనంది బాగానే చేశారు. గ్రామీణ రాజకీయాలు,కులాల ప్రస్తావన వంటి అంశాలను ఎలా డీల్ చేశామన్నది వెండితెరపై చూడాలి అని తెలిపారు.

Share post:

Popular