విజయ్ సేతుపతి పొలిటికల్ దర్బార్ ట్రైలర్.. చూస్తే అదుర్స్..?

అటు తమిళ ఇండస్ట్రీలో, ఇటు తెలుగులో కూడా విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతి నటించిన తుగ్లక్ దర్బార్ అనే సినిమాని నిజానికి మే నెల 2020 సంవత్సరం లోని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడం థియేటర్లు మూత పడడం జరిగింది. కాబట్టి ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.

ఇక అందుకే ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఈ సినిమా రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కు విక్రయించడం జరిగింది. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా రాజకీయ కామెడీ డ్రామా గా తెరకెక్కుతోంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి సరదా చేస్టలు కూడా ట్రైలర్ అంతట మనల్ని బాగా నవ్విస్తాయి..

ముఖ్యంగా సినిమాలో డైలాగులు చాలా చమత్కారంగా ఉన్నప్పటికీ , చివర్లో సత్యరాజ్ అలాగే సేతుపతి ల మధ్య సంభాషణ చాలా ఫన్నీగా ఉంటుందని చిత్ర మేకర్స్ వారు తెలుపుతున్నారు. ఈ సినిమాలో మంజిమా మోహన్ తో పాటు రాశిఖన్నా లు హీరోయిన్లుగా నటించారు. ఇక సీనియర్ నటుడు పార్థిపన్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాకు ఢిల్లీ ప్రసాద్ దీన్దయాల్ దర్శకత్వం వహించగా, గోపీచంద్ వసంత సంగీతం అందించారు ఈ సినిమా సెప్టెంబర్ 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది..https://youtu.be/IKNqeuxQKqk

Share post:

Latest