ఈ వారంలో విడుదవుతున్న సినిమాలు ఇవే…!

టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైంది. చాలా మంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పండగ వచ్చేసింది. కరోనా కేసులు తగ్గడంతో ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా సినిమా థియేటర్ల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనేేక థియేటర్ల తెరపై బొమ్మ పడింది. ఓటీటీలో రీలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా దాదాపుగా తగ్గిపోయింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా సినిమాలు విడుదలయ్యాయి.

అటు ఓటీటీలో ఇటు థియేటర్లలో సినిమాలు విడుదలయ్యాయి. అంతేకాదు ఇంకొన్ని సినిమాలు కూడా ఈవారంలో విడుదల అవ్వనున్నాయి. ప్రేక్షకుల ముందుకు ఈ వారంలో సునీల్ నటించిన కనబడుటలేదు, శ్రీ విష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ మూవీతో ఇంకా ‘క్రేజీ అంకుల్స్‌’ ఎఫ్ 9, సంపూర్ణేశ్‌ బాబు నటించిన ‘బజార్‌ రౌడీ’ సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో ప్రజలు సందడి చేయనున్నారు. ప్రేక్షకుల రాకతో సినిమా థియేటర్లు కలకలలాడుతున్నాయి. మళ్లీ సినిమా సందడి నెలకొంది.