టాలీవుడ్ లో టాప్ టెన్ టీజర్స్ ఇవే..

సాధారణంగా ఒక సినిమాను షూటింగ్ పూర్తిచేసి, థియేటర్లో విడుదల చేస్తే ఎటువంటి లాభం ఉండదు. అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రమోషన్స్ కోసం బృందం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి జనాల్లోకి తీసుకెళ్తుంటారు. ఇక చిన్న సినిమా అయినా సరే లేదా కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే పాన్ ఇండియా మూవీ అయినా సరే ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే తప్పకుండా ప్రమోషన్స్ చేసి తీరాల్సిందే. పబ్లిసిటీ లేకుండా ఏ సినిమా కూడా హైప్ పెరగడం అనేది అసంభవం. అందుకే ఇటీవల చిత్రబృందం ప్రస్తుతం సినిమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, సోషల్ మీడియా వేదికగా తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ప్రమోషన్ లో భాగంగా కంటెంట్ కు వచ్చే స్పందనను బట్టి సినిమా లో బజ్ ఉందా లేదా అనేది నిర్ణయిస్తారు. ఒక సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయగానే ఒక గంట లో ఎన్ని లైక్స్ వచ్చాయి ..ఎన్ని వ్యూస్ వచ్చాయి అని సినిమా మేకర్స్ ప్రచారం చేసుకోవడం ఇటీవల సర్వసాధారణమైపోయింది.

ఇక మన టాలీవుడ్ లో కూడా వ్యూస్ పరంగా టాప్ టెన్ లిస్ట్ లో ఏ ఏ టీజర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు టాలీవుడ్ లోనే , కేవలం ఒక రోజులో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ టీజర్ కు , కేవలం 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం.

ఇక యూట్యూబ్ అప్డేట్ వ్యూస్ ప్రకారం పుష్ప 24 గంటల్లో 22.5 రెండు మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని, సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఆర్ ఆర్ ఆర్ 14.14 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసుకుంది..

ఇకపోతే ఓవరాల్ గా ఈ రోజు వరకు తెలుగులో అత్యధికంగా వ్యూస్ ను నమోదు చేసుకున్న టీజర్ల విషయానికి వస్తే, పుష్ప 79.19 వ్యూస్ ను నమోదు చేసుకొని ప్లేస్లో ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ కు 61.56
మిలియన్ వ్యూస్ రాగా, ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి రామ్ చరణ్ సీతారామరాజు టీజర్ కు 56. 17 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. బాలకృష్ణ నటిస్తున్న అఖండ మూవీ కి 55.93 మిలియన్స్ వ్యూస్ రాగా, సరిలేరు నీకెవ్వరు చిత్రానికి 34. 02 వ్యూస్ వచ్చాయి. ఇకపోతే ఇప్పటివరకు సర్కారు వారి పాట సినిమా కేవలం ఒకటిన్నర రోజుల్లోనే 28 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసుకొని నెంబర్ వన్ పొజిషన్లో ఉంది.

Share post:

Latest