తెలంగాణలో ఇకమీదట ప్రతిరోజు 5 షోలట..!

కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమపై చాలా పెద్ద దెబ్బ పడింది. గత సంవత్సరం నుంచి థియేటర్లు మూత పడుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది అని ఊహాగానాలు ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నప్పటికీ.. సెకండ్ వేవ్ ఉద్రిక్తత తక్కువ అవడంతో, సినిమాలు రిలీజ్ చేయాలని ఉద్దేశంతోనే , మొదటిసారిగా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాను విడుదల ధైర్యం చేసి విడుదల చేశారు.

ఆ సినిమా కలెక్షన్ల పరంగా బాగా వసూలు చేయడంతో ఇక థియేటర్ల పరిస్థితి మెరుగుపడుతుందని, కర్ఫ్యూ వంటివి ఉండవని తెలుస్తున్నది. కానీ నైట్ షో లకు మాత్రం అనుమతి లేదని తెలిపింది. దీంతో థియేటర్ల యాజమాన్యం దోచుకోకుండా టికెట్ రేటు పెంపుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చాలా బాగానే సహకరిస్తున్నట్లు తెలుస్తున్నది.

అది ఏమిటంటే, చిన్న సినిమాలకు 5 షో లు అయ్యేలా చర్చలు జరుగుతున్నదని తెలుస్తోంది. అయితే ఇది నిజానికి వాస్తవమే కానీ ఇకపై థియేటర్ లపై సానుకూలంగా స్పందించడం జరుగుతోంది. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో.. కరెంటు బిల్లు వంటి సమస్యలను, వినోదపు పన్ను ల వంటి వాటిలో రాయితీలను కల్పించింది. అయితే ఇప్పుడు కూడా మరొకసారి తన సహృదయాన్ని తెలియజేసింది తెలంగాణ ప్రభుత్వం.

అయితే ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని చర్యలు చేపడుతున్నదో వేచిచూడాల్సిందే. ఇక S.R. కళ్యాణ మండపం సినిమా చిన్న సినిమా అవడంతో మొదట ఈ సినిమాతోనే మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే ఈ సినిమా వసూళ్ల పరంగా బాగా రావడంతో.. సినీ పెద్దలు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు.