ఆ భ‌యం నాకు లేదు..అదే ఓ వ‌రం అంటున్న త‌మ‌న్నా!!

టాలీవుడ్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్ప‌టికీ త‌న కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా రాన్ చేస్తూ ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌క సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో పాటు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ బుల్లితెర‌పై సైతం సంద‌డి చేస్తోంది.

Tamannaah Bhatia is ready to bend her no-kissing scene policy just for this  Bollywood actor! | Regional News – India TV

ఇప్ప‌టికే ఈమె న‌టించిన మాస్ట్రో, సీటీమార్ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా..గుర్తుందా శీతాకాలం, ఎఫ్‌-3 చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే..తాజా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న త‌మ‌న్నా ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. `పదిహేనేళ్ల వయసులో నా నటనా జీవితం ప్రారంభ‌మైంది. కెమెరా ముందు నటించే అవకాశం వస్తే చాలనుకున్నా. డబ్బు సంపాదించాలని, పెద్ద స్టార్‌నవ్వాలని ఏనాడూ కోరుకోలేదు.

Tamannaah Bhatia on COVID-19 lockdown: Universe is teaching us a lesson |  Entertainment News – India TV

వాటి గురించి మాత్రమే ఆలోచిస్తే నేను ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండేదాన్నే కాదు. గొప్ప పేరును సంపాదించడం కంటే ప్రతి రోజు సెట్స్‌లో ఉండటమే ఓ వరంగా భావిస్తాను. ఇక స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్‌కు దూరమవుతాననే భయం తనకు లేదు. కాబట్టే పాత్రల పరంగా ప్రయోగాలు చేస్తున్నా` అంటూ త‌మ‌న్నా చెప్పుకొచ్చింది.

Share post:

Latest