చిరంజీవిది లక్కీ హ్యాండ్.. సుధీర్ బాబు సంచలన వ్యాఖ్యలు?

ప్రస్తుతం సుధీర్ బాబు అంత పెద్ద బ్యాగ్రౌండ్ వుండి కూడా యాక్టర్ గా, బ్యాడ్మింటన్ గా, క్రికెటర్ గా, రైటర్ గా, ఇలా ప్రతి ఒక్క ఈ రంగంలో కూడా తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నాడు. భలే మంచి రోజు, యాత్ర, ఆనందోబ్రహ్మ లాంటి సినిమాలు తీసిన సుధీర్ బాబు ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను విజయ్ చిల్లా,శశి దేవి రెడ్డి నిర్మించారు. అయితే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ విధంగా మాట్లాడాడు.

రిస్కు తీసుకోవడానికి భయపడని సుధీర్ లాంటి వ్యక్తులు అంటే నాకు ఇష్టం అని, అలాగే విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని తెలిపారు. అలాగే చిరంజీవి ప్రమోట్ చేసిన సమ్మోహనం సినిమా హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయన ప్రమోషన్స్ తో ప్రారంభం అయ్యింది. అందుకే చిరంజీవి గారు నాకు లక్కీ హ్యాండ్ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మహేష్ బాబు కూడా ఒకానొక సందర్భంలో సుధీర్ బాబు కూడా కరెక్ట్ సినిమా పడితే వేరే లెవల్ లో అని అన్నారు. అయితే ఆ సినిమా ఇదే అవుతుంది అనుకుంటున్నాను అంటూ తెలిపారు సుధీర్ బాబు.

Share post:

Latest