గోదావరిపై సుధీర్ బాబు స్టంట్లు

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని సుధీర్ బాబు ఆశగా ఎదురుచూస్తున్నాడు. యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునే పనిలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ హీరో వినియోగించుకుంటూ వెళ్తున్నాడు. ఇక శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో లైటింగ్ సూరిబాబు అనే మాస్ పాత్రలో సుధీర్ బాబు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వస్తుండటంతో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లకు కొదువే లేదని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో గోదావరి నదిపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. ఏకంగా 80కు పైగా పడవలతో ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుందట. ముఖ్యంగా గోదావరి యాక్షన్ సీక్వె్న్స్‌లో ఈ ఫైట్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన అందాల భామ ఆనంది హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను పలాస చిత్ర దర్శకుడు కరుణ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించడంతో, ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Share post:

Popular