శృతిహాసన్ కి ఆయన అంటే ఇష్టమట..?

టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోయిన్లలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతి హాసన్. ఆమె తన తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్పింది. అంతేకాకుండా కమలహాసన్ గురించి కొన్ని విషయాలు వెల్లడించింది. కమల్ హాసన్ కూతురు గా సినిమా రంగంలోకి ప్రవేశించింది. శృతిహాసన్ తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఎందుకంటే ఆమె తీసిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈమె టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

ఇక పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసిన తర్వాత, ఈమె క్రేజ్ మాములుగా లేదు. ఆ తరువాత కొన్ని సినిమాలలో కూడా నటించింది. ఆ సినిమాల్లో మంచి సక్సెస్ ను అందుకున్న శృతిహాసన్ తెలుగులో కాకుండా తమిళంలో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈ సంవత్సరం క్రాక్ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది శృతిహాసన్. పాన్ ఇండియా ప్రభాస్ తో సలార్ సినిమాలో బిజీగా ఉంది. శృతి హాసన్ రీసెంట్ గా తన తండ్రి తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, కమలహాసన్ తన తండ్రి మాత్రమే కాదు..అంతకు మించి.. నాకు మంచి ఫ్రెండ్ అని తెలిపింది.

శృతిహాసన్ తండ్రి కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తన తండ్రి గురించి శృతిహాసన్ గొప్పగా చెబుతూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా శృతిహాసన్ ముక్కుసూటిగా మాట్లాడే నటి. శృతిహాసన్ మనసులో ఏ విషయాన్ని దాచుకోకుండా కుండ బద్దలు కొట్టేలా చెప్పేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది ఈ భామ.

అయితే ఈ భామ మళ్ళీ సక్సెస్ ఫుల్ హీరోయిన్. గా రాణిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.