అల‌నాటి అందాల తార శ్రీదేవి ఆస్తుల‌ విలువెంతో తెలిస్తే షాకే!?

అల‌నాటి అందాల తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి గురించి తెలియ‌ని వారుండ‌రు. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేసిన శ్రీ‌దేవి.. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్‌, మలయాళం భాషలలో వందలాది సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఏళ్ల పాటు సినీ ఇండ‌స్ట్రీని ఏలింది.

- Advertisement -

The larger picture: Radhika Apte gets trolled; Karan Johar to launch Khushi  Kapoor - The Week

హీరోల డామినేషన్‌ రోజుల్లోనూ వాళ్లకి మించిన ఇమేజ్‌తో రాణించిన ఘనత ఒక్క శ్రీదేవికే దక్కింది. అంతేకాదు, అగ్రహీరోలకు మించిన పారితోషికం అందుకున్న శ్రీ‌దేవి.. ఎన్నో ఆస్తుల‌నూ కూడ‌బెట్టింది. ప్ర‌స్తుతం శ్రీదేవి ఆస్తుల విలువ కు సంబంధించిన న్యూస్ ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. శ్రీ‌దేవి చ‌నిపోయే నాటికి లగ్జరీ వాహనాలు, ల్యాండ్స్, విలాసవంతమైన భవంతులు ఇలా చాలానే కలిగి ఉన్నారు.

EMOTIONAL Sridevi's Family Breaks Down In Front Of Media Realising She Has  PASSED AWAY - YouTube

అలాగే భ‌ర్త, ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్‌తో కలిసి లెక్కలేనన్ని ఇతర పెట్టుబడులు శ్రీదేవి పెట్టారు. వీట‌న్నిటి విలువ ఏకంగా 250 కోట్ల‌ట‌. ప్ర‌స్తుతం శ్రీ‌దేవి ఆస్తుల‌న్నిటినీ బోనీక‌పూర్ చూసుకుంటున్నారు. కాగా, శ్రీ‌దేవి 2018 ఫిబ్రవరి 24 న దుబాయ్ లో ఓ హోటల్లో బాత్ టబ్ లో కాలు జారి మరణించిన సంగతి తెలిసినదే. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ప్రమాదవశాత్తు మునిగిపోవడమే ఈ మరణానికి కారణమని పోలీసులు రికార్డును క్లోజ్ చేశారు.

Sridevi's Family On Posthumous National Award Win: 'Not Just A Super Actor,  She Was Also A Super Mom'

Share post:

Popular