శృతి హాసన్ ఏంటి ఇలా చేస్తుంది..?

ఇప్పుడున్న హీరోయిన్లలో శృతి హాసన్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈమె కమల్ హాసన్ కూతురుగానే కాకుండా మల్టీ ట్యాలెంట్ ఉన్న హీరోయిన్ గా అందరికీ తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, డాన్సర్, హీరోయిన్, మోడల్, ఇలా ఎన్న రకాల టాలెంట్ తో ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈమెకు ఏ సినిమాలు విజయాలను నమోదు చేయలేదు. మొదట్లో ఈమె తన తండ్రి పేరుతో ఎదిగినప్పటికీ ఆ తర్వాత తన తండ్రిపేరు ఎక్కడా వాడలేదు.

అసలు శృతి హాసన్ కు హీరోయిన్ అవ్వాలని తేదని చాలా సార్లు చెప్పుకొచ్చింది. అయితే డబ్బులు సంపాదించడం కోసం సినిమాలు చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత సినిమాల మీద ఇష్టంతో ఇందులో కొనసాగాలని నిర్ణయం తీసుకుంది. ఓ చిట్ చాట్ లో శృతి మాట్లాడుతూ తాను మ్యూజిక్ బాండ్ ఏర్పాటు చేయడం కోసం డబ్బులు అవసరమై హీరోయిన్ గా చేసిందంట. హీరోయిన్ రోల్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని ఆమె సినిమాల్లోనే కొనసాగుతున్నట్లు తెలియజేసింది.