శంకర్ దాదా ఎంబిబిఎస్ తరహాలో మరొక సినిమా కావాలంటున్న చిరంజీవి..

శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో కడుపుబ్బా నవ్వించాయో, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక మాస్ హీరోగా ప్రేక్షకులకు బాగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవిని, కమెడియన్ గా ఈ సినిమాలలో చూపించి మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకులు. ఇక ప్రస్తుతం చిరంజీవి యాక్షన్ సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న తరుణంలో ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ కావాలని కోరుతున్నాడట. అంతేకాదు ఆ సినిమా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ ల కొత్త తరహాలో ఉండేలాగా చూసుకోమని ఆ డైరెక్టర్ కు సూచించారట.

ఇంతకూ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. చిరంజీవి ఫ్యామిలీ కి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ కామెడీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మారుతి. మారుతి, చిరంజీవి కుటుంబం తో ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని తను రాసుకో బోయే కథకు హీరో అవ్వాలని అడిగారట మారుతి. ఆ నేపథ్యంలోనే ఆయన మారుతిని శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి కామెడీ తరహా సినిమా ఏదైనా ఉంటే చెప్పు , కచ్చితంగా నేను హీరోగా చేస్తాను అంటూ కూడా హామీ ఇచ్చాడట..

అయితే ఇప్పటికే బాబి, మెహర్ రమేష్ లను లైన్ లో పెట్టిన చిరంజీవి, ఇప్పుడు డైరెక్టర్ మారుతికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఎవరు దర్శకత్వంలో మొదటి సినిమా చేస్తారు అనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇకపోతే మారుతి కనుక చిరంజీవికి నచ్చినట్టు కథ రాసుకున్నట్లు అయితే , తప్పకుండా మరో కామెడీ సినిమాతో చిరంజీవి మన ముందుకు వస్తారు.

Share post:

Latest