`శాకుంతలం`కు గ‌మ్మ‌డికాయ కొట్టేసిన గుణ‌శేఖ‌ర్‌..వీడియో వైర‌ల్!!

స‌మంత అక్కినేని, మలయాళీ నటుడు దేవ్‌ మోహన్ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `శాకుంత‌లం`. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా చేసుకుని ఈ రమణీయ ప్రేమకావ్వాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Shaakuntalam Movie Launch Glimpse Video | Gunasekhar | Samantha | Dev Mohan  | Gunaa Teamworks - YouTube

అయితే తాజాగా శాకుతలం సినిమా షూటింగ్ మొత్తాన్ని ముగించేసి గుమ్మ‌డికాయ కొట్టేశాడు గుణ‌శేక‌ర్‌. ఈ నెల రెండో వారంలో స‌మంత పాత్ర‌కు సంబంధించిన షూట్‌ను కంప్లీట్ చేసిన గుణ‌శేఖ‌ర్‌.. ఆ తర్వాత దుష్యంతుడు పాత్రధారి దేవ్‌ మోహన్‌, ఇతర తారాగణంపై యుద్ధ సన్నివేశాలను పూర్తి చేశాడు. దాంతో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది.

Image

ఈ విష‌యాన్ని చిత్రబృందం అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. చిత్రబృందానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగం చెందారు దర్శక నిర్మాతలు. సినిమా షూటింగ్ పూర్తై సందర్భంగా గుమ్మడికాయ కొట్టారు. అలాగే చిత్రబృందానికి దర్శకుడు గుణ శేఖర్, చిత్ర నిర్మాత నీలిమా బహుమతులు అందచేశారు. కాగా, వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది. అలాగే అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే.

Share post:

Latest