ఏంటీ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కు స‌మంత అంత సంపాదిస్తుందా?

ఎలాంటి బ్యాగ్‌ గ్రౌండ్‌, సపోర్ట్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌మంత‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన‌ప్పుడే నాగ‌చైత‌న్యను ప్రేమ వివాహం చేసుకుని.. అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయింది. ఇక పెళ్లి త‌ర్వాత కూడా ఈమె హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆఫ‌ర్లు రావ‌డం ఆగ‌లేదు.

Did Samantha hike her remuneration after the stupendous success of Oh Baby?  | Telugu Movie News - Times of India

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స‌మంత‌.. అక్క‌డ కూడా భారీ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ముఖ్యంగా ఈ భామ‌కు ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఏకంగా 18 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకునే ప‌లు కంపెనీలు తమ బ్రాండ్లకు ప్రచారం చేయాల్సిందిగా స‌మంత ఇంటి ముందు క్యూ క‌డుతున్నారు.

Rangasthalam Queen Samantha Akkineni Got Expensive With A 3.5 Crore Salary!

ఈ నేప‌థ్యంలోనే స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అప్పుడ‌ప్పుడు ప‌లు ప్రోడెక్ట్స్‌ను ప్ర‌మోట్ చేస్తూ పోస్ట్ పెడుతుంటుంది. అయితే అలా ఆమె పెట్టే ఒక్కో పోస్ట్‌కు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు రెమ్యున‌రేష‌న్‌గా పుచ్చుకుంటుంద‌ట‌. స‌మంత క్రేజ్ దృష్ట్యా.. స‌ద‌రు కంపెనీలు సైతం అంత పెద్ద మొత్తంలో డ‌బ్బు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని తెలుస్తోంది.

Share post:

Latest