సమంత ఎందుకు అంతలా కష్టపడుతోంది..?

సినీ నటి సమంత అంటే.. పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఎందుచేతనంటే ఆమె టాలీవుడ్ లో మోస్ట్ లక్కీ గర్ల్ గా పేరు పొందినది. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి , తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇక నాగచైతన్య ని వివాహం చేసుకున్న తర్వాత, సినిమాలకు గుడ్ బై చెబుతుందని అందరూ ఆలోచించారు. కానీ అలా ఏమీ చేయకుండా, సమంత ఇంకా ముందుకు సాగిపోతోంది.

- Advertisement -

ఇక సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన నుంచి ఏదైనా ఫోటోలను, ఫంక్షన్లకు వెళ్లిన వారి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జిమ్ సెంటర్ లో చేస్తున్న కొన్ని ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అవి పూర్తిగా వైరల్ గా మారాయి. ఇక సమంత చేస్తున్నటువంటి పనికి ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

అయితే ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ లో “శాకుంతలం”అనే సినిమాలో నటిస్తున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే భారీ అంచనాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో కూడా ప్రముఖ నటులు, నటీమణులు కూడా నటిస్తుండడం గమనార్హం. ఇకపోతే సమంత తన పేరు పక్క నుంచి అక్కినేని అనే పేరును తీసేయడం వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కూడా మారింది.

అయితే ఈ శాకుంతలం సినిమా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సమంత పెళ్లి తర్వాత ఎన్నో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

Share post:

Popular