సైమా నామినేషన్ లిస్టులో ఉన్న పేర్లు ఇవే..?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నిర్వహించే సైమా అవార్డ్స్ ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఇక ఈ అవార్డు లో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ఎవరికిస్తారు అనే ఆత్రుత ఎప్పుడూ ఉంటుంది ప్రేక్షకులకు. అయితే 2019 సంవత్సరానికి సంబంధించి సైమా పురస్కారాలు ఈ ఏడాదిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఈ అవార్డ్ ల ఫంక్షన్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు సైమా చైర్ పర్సన్ బృంద ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

- Advertisement -

2021 వ సంవత్సరం సెప్టెంబర్ లో పురస్కార దినోత్సవం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ సారి నామినేట్ అయిన సినిమాలు ఇండస్ట్రీలో ఒక మ్యాజిక్ ను క్రియేట్ చేశాయని చెప్పారు. అంతే కాకుండా అత్యంత ఆదరణ పొందిన చిత్రాలలో మహర్షి (తెలుగు) , అసురన్ (తమిళం), యజమాన(కన్నడ), కుంభ లంగి నైట్స్ (మలయాళం) చిత్రాలు సైమా కు నామినేషన్లు ముందంజలో నిలిచాయి.

ఇక మహేష్ బాబు నటించిన మహర్షి 10 నామినేషన్ల లో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, మజిలీ 9 ప్లేస్ లో, జెర్సీ సినిమా ఏడు నామినేషన్ల లో ఉన్నది. ఇక తమిళంలో తీసిన ధనుష్ అసురం సినిమాకి 10 నామినేషన్ల, కార్తీ నటించిన ఖైదీ కి ఎనిమిది నామినేషన్లు, మలయాళంలో ఫాహద్ ఫజిల్ నటించిన కుంభకోణానికి ఏకంగా 13 నామినేషన్లు వచ్చాయి. ఇక అంతే కాకుండా కన్నడ సినిమాలో యజమాన అనే సినిమాకి 12 నామినేషన్లు వచ్చాయి.

Share post:

Popular