రోహిణి నటనా చాతుర్యం.. అచ్చం విజయ శాంతిలాగే?

బుల్లితెర లేడీ కమెడియన్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తనదైన పంచులు వేస్తూ, తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. ఒకప్పుడు సీరియల్స్ లో నటించిన ఈమె ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఈవెంట్ లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రోహిణి ని ప్రముఖ నటి విజయశాంతి పాత్రను పోషించింది. ఈమె ఆ పాత్రలో విజయశాంతినే బుల్లితెరపై కి ఎంట్రీ ఇచ్చింది అనే అంతలా మైమరిపించింది.

విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, ఒసేయ్ రాములమ్మ, ప్రతిఘటన, సరిలేరు నీకెవ్వరు లాంటి విజయశాంతి నటించిన సినిమాలు తీసుకునే వాటిలో ఆమె వేసిన పాత్రలు రోహిణి కూడా వేసి అచ్చం విజయశాంతి లాగే చేసింది. ఆమె చెప్పే డైలాగులు, డాన్సులు, అలాగే వస్త్ర ధారణ ఇలా ప్రతి ఒక్కటి విజయశాంతి ని గుర్తు చేసేలా ఉన్నాయి. రోహిణి పర్ఫార్మెన్స్ చూసిన హైపర్ ఆది వెండితెరకు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఐటీఐ బుల్లితెరకు లేడీ సూపర్ స్టార్ రోహిణి అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.