రమ్య హత్య కేసుపై స్పందించిన మంచు మనోజ్..?

సినిమా ఇండస్ట్రీలోని హీరోలు, హీరోయిన్లు సైతం తమ ప్రేక్షకులకు ఎటువంటి కష్టం వచ్చిన వాళ్ళు తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారిలో చాలామంది ఉన్నారు మన సినీ ఇండస్ట్రీలో. అయితే నిన్న జరిగిన ఒక ఘటనలో మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ ఆ హత్యపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు అదేంటో ఇప్పుడు చూద్దాం.

గుంటూరు జిల్లాలోని ఒక మెకానిక్ షాప్ లో పని చేసిన శశి కృష్ణ తనను ప్రేమించలేదని రమ్య అనే అమ్మాయిని హత్య చేసిన సంగతి ప్రతి ఒక్కరిని కలచివేసింది. అంతేకాకుండా శశి కృష్ణ , రమ్యను ఆరునెలలుగా వేధించే వాడట. ఇతను గతంలో మెకానిక్ పని చేసేవాడు. కానీ ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి రమ్య ను ప్రేమించడం వల్ల అతను ఆ పనిని కూడా మానేశాడు.

ఆమె వెంట పడుతుండటం తో ఆమెకి విసుగు వచ్చి తాను వెంట పడవద్దు అని చెప్పడంతో, ఆమెపై కత్తితో దాడి చేశాడు. అలా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రమ్యను, ఆమె అక్క మౌనిక గుంటూరులోని ఆసుపత్రికి తీసుకు వెళ్ళింది కానీ అప్పటికే రమ్య చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. తన మనవరాలి హత్యను కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమని , ఆదివారం రాత్రి 8 గంటలకు వెంకట్ రావు ఫిర్యాదు ఇవ్వడంతో.. శశి కుమార్ ను పరిధిలోకి తీసుకున్నారు పోలీసులు.

ఇక ఈ విషయంపై స్పందిస్తూ.. మంచు మనోజ్ గుంటూరు జిల్లాలో దేశం కులాన్ని బట్టి గౌరవిస్తోంది. హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి విషయంలో స్పందించిన మీడియా, ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు స్పందించలేదని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఆ చట్ట ప్రకారం నిందితునికి 20 రోజుల్లోనే శిక్షణ ఇవ్వాలని ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ ను కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ కుల సమస్య వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు.