రామ్ చరణ్ కార్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అంటే సినీ ఇండస్ట్రీలో, ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు ఉంది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తను మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఇప్పుడు స్టార్ హీరోగా బాగా ఎదుగుతున్నాడు.

- Advertisement -

ఇక రామ్ చరణ్ ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఆ రేంజ్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించిన ఏకైక హీరో రామ్ చరణ్. ఇక తన భార్య ఉపాసన కూడా ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తూ బాగా పేరు సంపాదిస్తోంది.

ఇక రామ్ చరణ్ వ్యక్తిగతంగా ఎంతో మంచి పేరు సంపాదించాడు. ఆ మధ్య కాలంలో రామ్ చరణ్ ను ఒక అభిమాని కలవడానికి వస్తే , తన ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే , రామ్ చరణ్ డ్రైవర్ యొక్క జీతం ఎంత ఉంటుందటే.. ఒక సంవత్సరనికీ దాదాపుగా 5 లక్షల వరకు ఇస్తారట.

ఇలాంటి జీతం కేవలం ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇచ్చేంత జీతాన్ని తన డ్రైవర్ కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ గా మారుతుంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ వరస సినిమాలతో బిజీగా ఉండగా, రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీలో నటిస్తున్నాడు. అంతేకాకుండా తన తండ్రితో కూడా ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.

Share post:

Popular