రామారావు తో మళ్లీ జతకట్టనున్న ఇలియానా..?

రవితేజ కెరీర్లో 68వ చిత్రంగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాకి రవితేజ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడట. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాదులోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా లాగే ఇందులో కూడా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందబోతున్నారట. ఈ సినిమాలో మాల తేజ సరసన “దివ్యాంశ కౌశిక్”, కర్ణం ఫేమ్ రాజీవ్ విజయన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియానా కూడా నటించబోతున్నట్లు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇందులో ఈమె ఒక స్పెషల్ సాంగ్ లో మాత్రమే కనిపించబోతున్నట్లు సమాచారం. ఇలియానా ఇలా స్పెషల్ సాంగ్ లో కనిపించడం ఇదే మొదటిసారి. అది కూడా కేవలం రవితేజతో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగానే ఒప్పుకున్నట్లు ఈ సినిమాకి తెలుస్తోంది.

గతంలో కూడా వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇక చివరగా అమర్-అక్బర్-ఆంటోని వంటి సినిమాల్లో కూడా వీళ్లిద్దరు కలిసి నటించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కిక్ సినిమా తో బాగా వీరిద్దరు ఫ్రెండ్స్ అయినట్లు తెలుస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాని కేవలం 56 రోజుల లోపల సినిమా షూటింగ్ ని పూర్తి చేసేలా దర్శకుడు శరత్ స్క్రిప్టు రెడీ చేసుకున్నారట.

ఇక ఈ సినిమాలో ఒకప్పటి తొట్టెంపూడి వేణు కూడా రీ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ సినిమాతో నైనా ఇలియానా ,తొట్టెంపూడి వేణు లకు కలిసి వస్తుందేమో వేచి చూడాల్సిందే.

Share post:

Latest