నీకేం నొప్పి.. మేము ఇద్దరం మేజర్లం అంటూ ట్రోల్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్!

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటే వెంటనే గుర్తుకొచ్చేది కాంట్రవర్సీ.ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా ఏ వ్యక్తి మీద అయినా ఎలాంటి సున్నితమైన అంశాల మీద అయినా సరే తన భావాలూ వ్యక్తం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.అయితే ఎప్పుడూ ఏదో ఒక విషయం లో వార్తల్లో నిలిచే వర్మ ఇటీవల ఒక అమ్మాయి తో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో పై అందించిన రామ్ గోపాల్ వర్మ ఆ వీడియోలో వున్నది నేను కాదు అంటూ కామెంట్ చేశాడు అయితే ఈ వీడియోపై ఎన్నో రకాల కామెంట్స్, అలాగే పెద్ద ఎత్తున చర్చలు నడిచిన సైలెంటుగా ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘాటుగా స్పందించారు.

నీకేం నొప్పి.. మేము ఇద్దరం మేజర్లం మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం. మధ్యలో మీకు ఏంటి అని నేరుగా ప్రశ్నించారు. అలాగే ఆ అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసి ఆ ఫోటోలో అమ్మాయి నాకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుందా? ఆమె సంతోషంగానే ఉంది గా? అలాగే నేను కూడా సంతోషంగా ఉన్నా? అలాగే చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉన్నారు మధ్యలో మీకు ఏంటి ప్రాబ్లమ్ అంటూ కొంచెం ఘాటుగానే స్పందించారు.