రాజమౌళి గురించి తన తండ్రి చెప్పిన నమ్మలేని నిజాలు..

సినీ ఇండస్ట్రీలో రాజమౌళికి ఒక దర్శకుడిగా ఎంత పెద్ద పేరుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ మూవీ లను తీయడానికి ముందుకు వస్తున్నాడు. అంతే కాదు ఎంతో మంది హీరోలను కూడా స్టార్ హీరోలుగా తీర్చిదిద్దుతూ . తనలో ఉన్న టాలెంట్ ను టాలీవుడ్ ప్రేక్షకులకు చూపిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈయన బాహుబలి సినిమా తో బాగా పాపులారిటీనే అందుకొని, ఇక ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించడమే కాకుండా హీరోల రేంజ్ ను కూడా పెంచేస్తున్నాడు. ఇంతటి గొప్ప దర్శకుడి గురించి తన తండ్రి ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ రాజమౌళి గురించి కొన్ని నమ్మలేని నిజాలను మనకు చెప్పాడు. ఇక ఈ నిజాలు తెలిస్తే అవును..! నిజమే కదా..! అని అనిపిస్తుంది.. ఇక సినీ ఇండస్ట్రీలో మిగతా దర్శకులతో పోలిస్తే రాజమౌళి సినిమాలు తీయడం చాలా నిదానం అని చెప్పాడు. అంతేకాదు ఒక సన్నివేశంలో టేక్ తీసుకోవాలంటే, షాట్ పూర్తిగా ఓకే అయ్యేంతవరకు రిపీట్ గా చేస్తూనే ఉంటాడు అని చెప్పాడు. అంతేకాదు అర్ధగంటలో ముగిసిపోయే సీన్ షూటింగ్, దాదాపు నాలుగు గంటల సేపు సమయం తీసుకుంటాడు.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఏ సినిమా అయినా సరే దాదాపుగా ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల సమయం తీసుకుంటుంది అని తన తండ్రి చెప్పుకొచ్చాడు..

విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటల విషయానికి వస్తే, బాహుబలి సినిమా తీయడానికి కూడా రాజమౌళి కొన్ని సంవత్సరాలు సమయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా చిత్రీకరించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఇక తనకు పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టమని , అతని సినిమాలన్నీ తక్కువ సమయంలో పూర్తవుతూనే మంచి విజయాన్ని అందుకున్నాడు అని, విజయేంద్ర వర్మ చెప్పాడు.