`రాజమనార్‌` పాత్ర పై జ‌గ్గుభాయ్ సంచలన వ్యాఖ్యలు…?

సినీ ఇండస్ట్రీలలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువయ్యింది. తాజాగా హీరో ప్రభాస్ ఓ అద్బుతమైన పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇందుకు దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రోజు నుంచి సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. సలార్ లో జగపతి బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తాజాగా సినిమాలో జగపతి బాబు క్యారక్టర్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. రాజమనార్ గా జగపతిబాబు కనిపించనున్నాడు. జగపతిబాబు లుక్ చూస్తుంటే అతి భయంకరంగా ఉంది. తనకు ఇలాంటి పాత్రను ఇచ్చినందుకు జగపతిబాబు దర్శకుడు ప్రశాంతి నీల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాను విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.