పుష్ప సినిమాలో రష్మిక నటిస్తున్న పాత్ర ఇదే..?

టాలీవుడ్ లో పుష్ప సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ లుక్స్, క్యారెక్టర్ చూస్తే ఈ సినిమాకి ఎంతో హైప్ ను తెచ్చి పెట్టాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన పాత్ర గురించి ఒక సమాచారం వెలువడింది.. ఆ విషయాన్ని చూద్దాం.

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ , రష్మిక మందన, సునీల్ ఇలా ఎంతో మంది ప్రముఖ నటులు ఇందులో నటిస్తుండడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ రష్మిక కి సంబంధించిన ఒక పాటను కూడా త్వరలోనే విడుదల చేస్తామని , చిత్ర యూనిట్ తెలపడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో ఇప్పటికే రెండు పాటలను కూడా ఈ మధ్యనే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక శ్రీవల్లి పాత్రలో కనిపించబోతుందని సమాచారం. ఇక క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు చిత్రం యూనిట్. పులి మేక అనే పాట తోనే మంచి రికార్డును సొంతం చేసుకున్న ఈ సినిమా , వచ్చే పాటలతో ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.