పవన్ కళ్యాణ్ ఆలోచించాడు.. మహేష్ బాబు కొట్టేశాడు ?

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో మంది ఫ్యాన్స్ ను కలిగిన స్టార్ లుగా గుర్తింపు పొందారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలంతా ఎంతో ఆప్యాయంగా ఉంటామని ఒకానొక సందర్భంలో, స్టార్ హీరోలు మొత్తం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. కానీ అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అని అంటుంటారు. అయితే ఇప్పుడు ఇద్దరి స్టార్లు ఒకే విషయంపై ఉన్నారట. ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం..

మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా ని జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక వారం రోజులు సెలవులు ఉంటాయన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలని చిత్ర సభ్యులు ఆలోచించారు.

అయితే ముందుగా ఈ సమయానికి పవన్ కళ్యాణ్ రానా కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను విడుదల చేయాలని ప్రకటించారు. ఇక ఒకవేళ మహేష్ బాబు నటించిన సినిమాను మరుసటి రోజు వస్తే, చాలా ఇబ్బంది వస్తుందన్న సందేహం తోనే ఆలోచిస్తున్నారట.

ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన తర్వాత మరొక మూడు సినిమాలు కూడా విడుదల అవుతున్నాయని, సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇక దీంతో థియేటర్ల కొరత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా థియేటర్ లు తగ్గే అవకాశం కూడా ఉంటాయని, పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న నిర్మాత ఆలోచిస్తున్నారట. అయితే అనవసరంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ముందుగానే ప్రకటించినందుకు తెగ ఫీల్ అవుతున్నారట.

Share post:

Latest