ఒకే ఫ్రేమ్ లో బడా స్టార్స్..పిక్ వైరల్

ఫ్రెండ్ షిప్ డే ను పురస్కరించుకొని మన టాలీవుడ్ స్టార్ హీరోలు అంతా ఒకే ఫ్రేమ్ పై కనిపించి, సందడి చేశారు. ఇక ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలు, హీరోయిన్లు తమ స్నేహితులతో గడిపిన కొన్ని మధుర క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.. ఇక అంతే కాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , రానా ల తో కలసి దిగిన ఒక మెమొరబుల్ ఫోటోను నాని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంటాడు.

ఇక ప్రస్తుతం ఈ ఫోటోను ఆయా హీరోల కు సంబంధించిన అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటో దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి సందర్భంగా రాజస్థాన్ లో దిగిన ఫోటో. అంతే కాదు అప్పుడప్పుడు తన స్నేహితులతో వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోలను కూడా, నాని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన “టక్ జగదీష్” చిత్రం విడుదలకు రెడీగా ఉంది.అంతేకాదు కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న శ్యామ్ సింగరాయి సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు “అంటే సుందరానికి ” అనే సినిమాను కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు నాని. ఏది ఏమైనా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరి హీరోలను ఒకే వేదికపై చూడడం అభిమానులకు ఎనలేని సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఒక ఈ ఫోటోను చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest