ఒకప్పుడు జబర్దస్త్ షోలో ఉన్న సత్య శ్రీ గురించి తెలుసా..?

బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో .. ఎంతో మంది కమెడియన్ల తయారుచేసింది. అంతేకాకుండా ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ హీరోలు గా, స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు ఎదిగారు. ఇక ఇందులో అప్పట్లో చమ్మక్ చంద్ర స్కిట్స్ అంటే విపరీతంగా క్రేజ్ ఉండేది. అయితే అందులో ఒక అమ్మాయి కనిపించేది.ఆ అమ్మాయి గురించి పూర్తీ విషయాలు చూద్దాం.

గత కొన్ని సంవత్సరాల కిందట జబర్దస్త్ లో చంద్ర స్కిట్ కోసం అందరూ వెయిట్ చేసే వారు ప్రేక్షకులు. అయితే తను చేసే స్కిట్ లో ఒక లేడి కమెడియన్ ని ఎంట్రీ ఇచ్చేలా చేశాడు చమ్మక్ చంద్ర. ఆమె పేరే సత్య శ్రీ. ఆమె తనదైన శైలిలో పంచులు వేస్తూ బాగా నవ్వించేది. ఇక వీరిద్దరూ కలిసి ఫ్యామిలీ స్కిట్స్ ఎన్నో చేశారు. ఈమె వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. కానీ తనకు ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో ఇక జబర్దస్త్ షో లో ఎంట్రీ ఇచ్చి, నిరూపించుకుంది.

జబర్దస్త్ లో తొలిసారిగా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె చమ్మక్ చంద్ర తో పాటు ఈమె కూడా బయటకి వెళ్ళిపోయింది. ఆ తరువాత ప్రసారం అవుతున్న ఒక ప్రముఖ ఛానల్లో కూడా తిరిగి మరీ వీరిద్దరే జోడీ కట్టారు. ఈమె జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా పలువురు లేడీ కమెడియన్ల కు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం.. రోహిణి, వర్ష, పవిత్ర లు బాగా తమ కామెడీ తో ఆకట్టుకుంటున్నారు. ఇదంతా కేవలం సత్య శ్రీ వల్లనే జరిగిందని, నెటిజన్లు అనుకుంటున్నారు.