ఎన్టీఆర్ ఆ షోలో టైమింగ్ తగ్గించడానికి గల కారణం ఇదే..?

ఎన్టీఆర్ యాంకర్ గా చేయబోతోన్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ఈ నెల 22న రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత మరొక సారి బుల్లితెర మీద హోస్ట్ గా చేయడానికి ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు షో ద్వారా బుల్లితెరపై అలరించడానికి వస్తున్నారు. మే మాసం నుంచి ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా సమయం వల్ల ఈ షో నీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

ఆగస్టు 22వ తేదీన కర్టెన్ రైజర్ ప్రసారం కానుండగా 23 వ తేదీ నుంచి సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ షో ప్రారంభం కానుంది. అని ఎన్టీఆర్ ప్రోమోలు తెలియజేశారు. అయితే గత కొంతకాలంగా ఈ షో , బిగ్ బాస్-5 షో లు ఒకే సమయానికి ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఎక్కువగా కనిపిస్తోంది. బిగ్ బాస్ షో విషయానికొస్తే, వీక్ డేస్ లో రాత్రి 9: 30 నిమిషాలకు, వీకెండ్ లో 9:00 గంటల కే ప్రసారమవుతుంది.

మీలో ఎవరు కోటీశ్వరులు అనే షో విషయానికొస్తే, ఈ రెండు షో లు భారీ బడ్జెట్ తో రూపొందించడం వల్ల ఒకే సమయంలో ప్రసారం అయితే రెండు షో లకు రేటింగ్ విషయంలో చాలా నష్టం జరుగుతుంది. అందువల్లనే ఎన్టీఆర్ షో, బిగ్ బాస్ షో తో పోటీ పడకుండా ఈ విషయంలో కాస్త సమయాన్ని చేంజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరులు షో మంచి టిఆర్పి రేటింగ్ ను భావిస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని అనుకుంటున్నారు.