నయనతార , విఘ్నేష్ తో వున్న ఈ పాప ఎవరు..?

తెలుగు, తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సెట్ చేసుకున్న హీరోయిన్ నయనతార. అంతేకాదు దక్షిణ భారత సినీ రంగంలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు పొంది, లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతోంది. తెలుగులో పలువురు స్టార్ హీరోలతో నటించి ,గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఆ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారంలో కొద్దిరోజులు సతమతమైంది అనే చెప్పాలి.

చివరికి తమిళ సినీ ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన విగ్నేష్ శివన్ తో గత కొంత కాలం నుండి డేటింగ్ లో ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినట్లు, ఇటీవల తన చేతికి ఉన్న ఉంగరం చూపిస్తూ చెప్పడం గమనార్హం.

ఇక నయనతార తన చేతుల కౌగిళ్లలో ఒక పాపను పట్టుకుని , పక్కనే తన కాబోయే భర్త విఘ్నేష్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా , ఇంతకు నయనతార పట్టుకున్న ఆ చిన్నారి ఎవరు..? అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న కథు వాకల రెండు కాదల్ అనే సినిమాలో ఈ చిన్నారి పాప ఒక పాత్ర పోషిస్తోందని అనే వార్తలు వస్తున్నాయి ఇక ఈ పాప ఎవరు అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం, మరికొంత కాలం వేచి ఉండాల్సిందే అంటూ అంటున్నారు చిత్రం యూనిట్ సభ్యులు.

Share post:

Latest