నరేష్ పై విమర్శల వర్షం కురిపిస్తున్న నటి హేమ.. కారణం..?

ఇక హీరోగా గుర్తింపు పొందిన నరేష్ అలాగే నటిగా గుర్తింపు పొందిన హేమ వీరిద్దరూ గొడవ పడుతున్నారు అంటే, ముందుగా గుర్తొచ్చేది మా ఎలక్షన్స్.. నిజమే మీరు విన్నది..నేను చెబుతున్నది.. గత కొద్ది కాలం నుండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికల గొడవ జరుగుతూనే ఉంది. ఒకరిమీద ఒకరు విమర్శించుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన నటి హేమ కూడా, హీరో నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

Naresh: Age, Photos, Biography, Height, Birthday, Movies, Latest News,  Upcoming Movies - Filmiforest

ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేష్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది.. హేమ చెబుతున్న మాటలు విషయానికొస్తే.. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేష్ ఎన్నికలు లేకుండా చేసి, అధ్యక్షుడిగా తను కొనసాగాలని పావులు కదుపుతున్నారు అంటూ ఆరోపించింది.. ప్రస్తుతం మా అసోసియేషన్ ఛానల్ కోసం ఒక్క రూపాయి కూడా సంపాదించకపోగా, మా అసోసియేషన్ ఫండ్ కి ఇచ్చిన డబ్బులను కూడా సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నాడు అంటూ విమర్శించింది. ఇక ఏ మాత్రం బాధ్యత లేకుండా పని చేస్తున్న నరేష్ ను దించడం కోసం అయినా సరే తప్పకుండా మా ఎలక్షన్లు నిర్వహించాలని ఆమె తెలిపింది.

ఇక ఇప్పటికే మా ఎలక్షన్ల బరిలోకి ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు, హేమ, జీవితారాజశేఖర్ వంటి కొంతమంది ప్రముఖులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇక నటి హేమ.. తనకు ఎన్నికలలో సపోర్ట్ చేసిన వారి కోసమే, తను అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారనే విషయం తెలిసిందే.