నాగార్జున వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. !

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున అంటే ఎంతో మంచి గుర్తింపు వున్న వ్యక్తి . ఈ విషయం మనకు బాగా తెలిసిందే . దాదాపుగా 60 సంవత్సరాలు వచ్చినా కూడా నవమన్మధుడు గా పేరుపొందాడు నాగార్జున. ఇక అతని ఇద్దరు కుమారులు కూడా హీరోలుగా రాణిస్తున్నారు. అయితే నాగార్జున కెరియర్ లో వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.

1). ఘర్షణ:
మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చాలా కోరికగా ఉండేదట నాగార్జునకి. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల మణిశర్మ సినిమా తన దగ్గరికి వచ్చినా కూడా ఆఫర్ వదిలేయాల్సి వచ్చింది. ఆ సినిమానే ఘర్షణ.

2). మెకానిక్ అల్లుడు:
ఇక నాగార్జున వదులుకున్న మరొక సినిమా మెకానిక్ అల్లుడు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కలిసి నటించారు.

3) మౌనరాగం:
నాగార్జున కెరియర్ లోనే ఒక మంచి క్లాసికల్ సినిమానే వదులుకున్నాడని చెప్పుకోవచ్చు. తన మొదట్లోనే సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు, ఈ కథ తన దగ్గరకు రావడంతో తను పెద్దగా కథల విషయంలో దృష్టి పెట్టక, ఈ సినిమాని వదిలేస్తున్నా డు.

4). కలిసుందాం రా:
వెంకటేష్ కెరీర్ లోనే మంచి హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో కలిసుందాం రా.. కూడా ఒకటి. అయితే ఈ సినిమాని నాగార్జున వదులుకోవడానికి గల కారణం ఏమిటంటే.. అప్పట్లో వరుసగా ఫ్యామిలీ సినిమాలు తీశాడు .కాబట్టి కథ రొటీన్ గా ఉండటం తో ఈ సినిమాను వదులుకున్నాడు.

5). బద్రి:
పవన్ కళ్యాణ్ కెరీర్ ని, పూరి జగన్నాథ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా బద్రి. ఈ స్టోరిని ఫస్ట్ నాగార్జునకి చెప్పారట. ఈ సినిమా తీసే సమయంలో పూరి జగన్నాథ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అందుచేతనే ఈ సినిమాని నాగార్జున వదిలేయాల్సి వచ్చింది.

అలాగే దళపతి, ఆర్జివి రామాయణం,ఆహా వంటి సినిమాలను వదులుకోవడం జరిగింది. ఇవన్నీ తీసింటే నాగార్జున కెరియర్ మారిపోయేదని చెప్పుకోవచ్చు.