బంగార్రాజు ఫస్ట్ లుక్ రిలీజ్.. మామూలుగా లేదుగా?

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా అభిమానులకు వరుసగా గిఫ్ట్ లు ఇస్తున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ అనే చిత్రాన్ని చేస్తుండగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా చేస్తున్నాడు. ఈ బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి నేడు తన తండ్రి బర్త్ డే సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశాడు నాగచైతన్య. ఇందులో డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ నాగార్జున స్వర్గం నుంచి దిగుతున్నట్టుగా ఉంది.వర్షంలో కత్తి పట్టుకొని ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్ ప్యాక్‌ లుక్‌లో నాగార్జున కనిపిస్తున్నారు.

 

బంగార్రాజు సినిమాలో నాగార్జున తో పాటు, నాగచైతన్య కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో నాగార్జునకి జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్య కు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాంటసి థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

Share post:

Latest